రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పి జి ఆర్ ఎస్ – మీ కోసం లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన”పి జి ఆర్ ఎస్ – మీ కోసంలో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగిందని నగరపాలక సంస్థ ఇన్చార్జి అదనపు కమిషనర్ ఎస్.వెంకటరమణ, హెల్త్ ఆఫీసర్ వినూత్న తెలియ చేశారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తరపున ఇన్చార్జి అదనపు కమిషనర్ ఎస్. వెంకటరమణ హెల్త్ ఆఫీసర్ వినూత్న తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిధిలో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందన్నారు.
కొన్ని అర్జీలు.
రాజమహేంద్రవరం, కోటిలింగాల పేటకు చెందిన పి. రామకృష్ణ అనే వ్యక్తి తమ వీధిలో వీధిలైట్లు లేకపోవడం వలన రాత్రి సమయాల్లో చాలా ఇబ్బందికరంగా ఉందని కావున వీధిలైట్లు, ఎలక్ట్రికల్ పోల్స్ వేయించవలసినదిగా కోరుతూ దరఖాస్తు నందు పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం, ఆనందరావుపేటకు చెందిన కె భాస్కర్ సాయికుమార్ తమ వీధిలో రోడ్లు మరియు డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉన్నందున పరిష్కరించవలసినదిగా కోరుతూ దరఖాస్తు చేసుకొని ఉన్నారు.
రాజమహేంద్రవరానికి చెందిన ఈ లక్ష్మి అనే మహిళ గత మున్సిపల్ కమిషనర్ గారు రద్దు చేసిన ఇండ్ల స్థలం పన్ను, ఇంటి పన్ను ఇంకా కొనసాగుతూ ఉందని, తమ స్థల, ఇంటి పన్నును రద్దు చేయవలసినదిగా దరఖాస్తు నందు కోరి ఉన్నారు.
రాజమహేంద్రవరానికి చెందిన ఏ. వీరభద్ర రావు అనే వ్యక్తి తన ఇంటి కొళాయి మార్పు చేయవలసినదిగా దరఖాస్తు నందు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎస్ ఇ జి. పాండు రంగారావు, సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News