అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా డివిజన్ స్థాయి అధికారులు కృషి చేయాలి.

-కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీదారులు వ్యయ ప్రయాసలుపడి ఆర్డీఓ కార్యాలయం వరకు రానవసరం లేదని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ డివిజన్ లో ఉన్న మండల తాహిసీల్దార్ కార్యాలయాల్లో మీ కోసం అర్జీలు సమర్పించుకోవచ్చని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో భాగంగా కొవ్వూరు డివిజన్ పరిధిలోని ప్రతి మండల తాహసిల్దార్ / కార్యాలయా ల్లో అందరూ మండల స్థాయి అధికారులు ఒక్క చోట ఉండి ప్రజలను నుంచి అర్జీలను స్వీకరిస్తారని అక్కడ అందచేయాలని రెవిన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు.

ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ “పిజి ఆర్ఎస్ – మీ కోసం”  ద్వారా ప్రజల నుంచి ఈ రోజు 9 అర్జీలను స్వీకరించడం జరి గిందన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించి దరఖాస్తు దారునికి తగిన స త్వర న్యాయం చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. మీ కోసంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి… వారు సంతృప్తి చెందేలా అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో జి. జవహర్ బాజీ శర్మ, డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *