Breaking News

చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్

-ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ అని.. ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నూజివీడు సత్యనారాయణ థియేటర్ ఎదురుగా వికాస్ కాలేజ్ పక్కన నూతనంగా నిర్మించిన సి.సి రోడ్డును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రోడ్ల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో రూ.861 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నామన్నారు.

పట్టణంలో మురుగు డ్రైనేజీ లను పరిశీలించిన మంత్రి
పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చెత్త పేరుకుపోయిన మురుగు డ్రైనేజీ పరిశీలించారు. వాటిని తక్షణమే పూడిక తీయించి మురుగు నీటిపారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’

-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *