Breaking News

బుద్ధవరంలో అంగరంగ వైభవంగా అభయ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం వేడుకలు

-స్వామివారి పట్టు వస్ట్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ఆలయ కమిటీ వారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. గుదిమెళ్ళ దిలీప్ కుమార్ ఆచార్యుల సమక్షంలో ఉదయం స్వామివారి పంచామృత అభిషేకం, నవరసాభిషేకం, సింధూరభిషేకం పుష్పాభిషేకాలు నిర్వచించారు. అనంతరం గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం ఆంజనేయ హోమం, శాంతి హోమం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం లక్ష తమలపాకులతో సహస్రనామము గంధ సింధూర పూజ నిర్వహించి హనుమాన్ చాలీసాలతో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

మధ్యాహ్నం జరిగిన పూజా కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు ఆలయ కమిటీ వారు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల వారు సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. 40 మంది జంటలు (భార్య భర్తలు) ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *