Breaking News

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటేయండి

-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిద్దార్థ నగర్ పాలిక్లినికల్ రోడ్ లోని సిద్దార్థ ఫార్మాసిటికల్ కళాశాలలోని ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ ఓటర్లను శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కలిసి కరపత్రాలు పంపిణి చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యరించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటువేసినట్లే అన్నారు. పట్టభద్రులు ఓటువేసే సమయంలో పీడీఎప్ అభ్యర్థిగా నిలిచిన లక్ష్మణరావు వెనక వైకాపా ఉందన్న విషయం పట్టభద్రులు గ్రహించి నిర్ణయం తీసుకోవాలని గద్దె అనురాధ కోరారు. వైసీపీ ముసుగు రాజకీయాల్ని చేధించాల్సిన సమయం వచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారానే అది నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. తాము ఎక్కడకు వెళ్ళి ఎవరిని కలిసినా ఆలపాటికే తమ మద్దతు అని పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా చెబుతూ కూటమి వైపు సానుకూలంగా ఉండడం శు భపరిణామం అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *