Breaking News

తహశీల్దార్ కుప్పయ్య సేవలు ఎనలేనివి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ శాఖకు తహశీల్దార్ కుప్పయ్య సేవలు ఎనలేనివని, వారికి విధులు పట్ల ఉన్న అంకిత భావం చాలా గొప్పదని, సౌమ్యులు అని వారి సేవలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పలువురు కొనియాడారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కుప్పయ్య తహశీల్దార్ పదవీ విరమణ వీడ్కోలు సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు కలెక్టరేట్ సిబ్బంది హాజరయ్యారు.

కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగమే దైవంగా పనిచేశారని, తహశీల్దార్ కుప్పయ్య సేవలు ఎనలేనివని, వారికి విధుల పట్ల ఉన్న అంకిత భావం చాలా గొప్పదని, సౌమ్యులు అని వారి సేవలను కొనియాడుతూ వారి శేష జీవితం చాలా ప్రశాంతంగా ఆయు ఆరోగ్యాలతో వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

జెసి మాట్లాడుతూ వారు రెవెన్యూ శాఖలో ప్రోటోకాల్ విభాగం విధులను సమర్థవంతంగా నిర్వహించారని, నమ్మకంగా విధులు నిర్వర్తించారని, వారి సేవలు రెవెన్యూ శాఖకు ఎంతగానో విలువైనవి అని, ఇతరులు వారి పని తీరును ఆదర్శవంతంగా తీసుకోవాలని వారు తెలిపారు.

డిఆర్ఓ మాట్లాడుతూ కుప్పయ్య తనకు ఏ విధులు అప్పగించినా బాధ్యతతో, చిత్త శుద్ధితో నిర్వర్తిస్తారని వారి సేవలను కొనియాడారు.

రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, వారి శ్రేయోభిలాషులు పలువురు మాట్లాడుతూ వారి శేష జీవితం ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు.

పదవీ విరమణ వీడ్కోలు గ్రహీత కుప్పయ్య మాట్లాడుతూ తాను కండక్టర్ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించానని, అనంతరం టైపిస్ట్ గా రెవెన్యూ శాఖ నందు విధులు నిర్వర్తించి అంచెలంచెలుగా 40 సం. ల సర్వీసు పూర్తి చేసుకుని నేడు తహశీల్దార్ స్థాయిలో అందరి సహకారంతో, ఆశీస్సులతో మనః సంతృప్తిగా పదవీ విరమణ చేయుచున్నానని, తన ఉద్యోగ ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం కలెక్టర్, జెసి, డిఆర్ఓ, తహశీల్దార్లు, పలువురు అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు కుప్పయ్య దంపతులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తిరుపతి రామ్మోహన్, ఎస్డిసి లు దేవేంద్ర రెడ్డి, రోజ్ మాండ్, సుధారాణి కలెక్టరేట్ ఎ.ఓ భారతి, కలెక్టరేట్ సిబ్బంది, పలువురు తహశీల్దార్లు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *