Breaking News

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగిన జాతీయస్థాయి క్యాడిట్ (అండర్ 14) మరియు సీనియర్ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాలోని అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొత్తం 16 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని మొత్తం 46 పతకాలను గెలుచుకున్నారు. వీటిలో 19 బంగారు పతకాలు, 16 వెండి, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావు, పసుపులేటి గౌరీశంకర్ పతకాలు గెలుపొందిన క్రీడాకారులతో కలిసి కలెక్టర్ డా. జి.లక్ష్మీశను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పతకాలు సాధించిన చిన్నారులను కలెక్టర్ అభినందించారు. మరింత కష్టపడి శిక్షణ తీసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని.. జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావును కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేకంగా అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *