Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి

-రీ ఓపెన్ కి తావు లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి తావు లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపాలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) పై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. (PGRS) లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని అని అన్నారు. పరిష్కారo చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీ ఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండలాలు, డివిజన్ పరిధిలో ను తప్పని సరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జిదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలి అని అన్నారు. అర్జిదారులు వారి సమస్యకు పరిష్కార దిశగా గ్రీవెన్స్ రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీ దారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానoగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారo చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను ఓపెన్ చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *