-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి.
-డిఆర్ఓ , సహాయ ఎన్నికల అధికారి టి. సీతారామమూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 27 వ తేదీన నిర్వహించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు నోడల్ అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు పనిచేయాలని డిఆర్ఓ , సహాయ ఎన్నికల అధికారి టి. సీతారామమూర్తి, సూచించారు.
గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఛాంబర్లో
తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందుస్తూ ఏర్పాట్ల ప్రక్రియపై నోడల్ అధికారులతో జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామమూర్తి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27 న పోలింగ్ కు సంబంధించి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లాలో 92 పోలింగు కేంద్రాల పరిధిలో 63,441 మంది ఓటర్లు గా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 750 నుంచి 1000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని సీతారామ మూర్తి తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి విధులు నిర్వహించే అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా సజావుగా నిర్వహించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 23 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలు, 6 ఎస్ ఎస్ టి బృందాలను నియమించమన్నారు. పిఓ,ఏపిఓలకు, ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, త్రాగునీరు, విద్యుత్ , షామియానాలు, ర్యాంపులు, టాయిలెట్, టెలిఫోన్, తదితర వసతులను కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో కేఆర్ ఆర్ సి ఎస్డీసీ డి భాస్కర్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఐ కాసయ్య, జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్, డిఆర్ డిఏ పీడీ ఎన్వీవీఏస్ మూర్తి, డి ఎల్ డి ఓ పీ. వీణా దేవి, మాస్టర్ ట్రైనీలు వక్కలంక త్రినాధకుమార్, రేఖ, రాము, రాజు, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News