Breaking News

ఘనంగా మహిళా ఉత్సవ్‌-2025

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన శిక్షణ సంస్ధాన్‌, విజయవాడ వారు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించు మహిళా ఉత్సవాన్ని, ఈ సంవత్సరం 2024`25 శనివారం మొగల్‌ ఫంక్షన్‌ హాలు, మధు గార్డెన్ప్‌ నందు సంస్ధ చైర్మన్‌ డా. ఎన్‌.విద్యా కన్నా ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ సభను నిర్వహించగా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమ సభకు ముఖ్య అతిధి కె.సుహసిని దేవి , పి.డి, (రిటైర్డ్‌) డిపార్డ్‌మెంట్‌ ఆఫ్‌ వుమెన్‌ & చైల్డ్‌ వెల్‌ఫేర్‌ (ఉమ్మడి కృష్ణా జిల్లా), హాజరు కాగా వై.స్వరూప రాణి, ప్రెసిడెంట్‌, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ దివాస్‌, మరియు కె.రాజేశ్వరి, తరుణీ తరంగాల సభ్యులు వారు హాజరు కాగా, సంస్ధ డైరెక్టర్‌ ఎ.పూర్ణిమ ఆధ్యక్షత వహించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన కె.సుహసిని దేవి మాట్లాడుతూ… విజయవాడ మరియు పరిసర ప్రాంత సూక్ష్మ చిన్న తరహా స్థాయి ఉత్పత్తిదారులకు జన శిక్షణ సంస్ధాన్‌. విజయవాడ వారు ప్రతి ఏటా నిర్వహించు మహిళా ఉత్సవ్‌ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, సంస్ధ నుండి వృత్తి విద్యను నేర్చుకున్న వారికి పారిశ్రామికత పై అవగహన కల్పించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించు వివిధ పధకాల పై అవగహన కల్పించుట వలన వారిని ఉత్తత్పి యూనిట్‌ ఏర్పాటు చేసుకొనుటకు ప్రేరణ చెందేలా చేయుట వలన ఎంతో మంది కొత్త మహిళా పారిశ్రామికులను తయారు చేస్తున్నారని ఇది ఎంతో అభినందనీయమైన విషయంగా చెప్పకొవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం మహిళా ఉత్సవ్‌కు వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలు సక్సెస్‌ సాధించాలని అకాక్షించారు.
అతిధిగా విచ్చేసిన వై.స్వరూవ రాణి మాట్లాడుతూ… మహిళ పారిశ్రామిక వేత్తలు తమ తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి, తమ ఉత్పత్తుల ధరను నిర్ణయించడానికి చక్కని ప్రయత్నంగా మహిళా ఉత్సవ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని, అంతే కాకుండా, వారికి కావలసిన ఇతర ఉత్పత్తులను ఈ ఉత్సవ్‌ ద్వారా గుర్తించడం, మార్కెంటింగ్‌ వైపు దృఢమైన అడుగులు వేయగలుగుతారని అన్నారు.
సంస్ధ చైర్‌పర్సన్‌ డా. విద్నాకన్నా మాట్లాడుతూ… జన శిక్షణ సంస్ధాన్‌, విజయవాడ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ మహిళలకు, యువతకు వారి నైపుణ్యావసరాలకు సరిపడా అనేక శిక్షణా కార్యక్రమాలు రూపొందించి ఎన్‌.టి.ఆర్‌ జిల్లాలో నిర్వహించటం జరుగుతోంది. ప్రతి సంవత్సరం మహిళలకు అధిక సంఖ్యలో నైపుణ్యాలు అందచేయటమే కాక, వారికి మేనేజిమేంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారు స్వయం/ వేతన /ఉపాది వివిధ సంస్ధల ఆర్ధిక సహాయంతో చేపట్టే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే 40 సంవత్సరాలుగా ఎంతో మంది పారిశ్రామిక యువతను తయారు చేసిన ఘనత మన జన శిక్షణ సంస్ధాన్‌కు ఉందని అని, నైపుణ్య విద్య నేర్చుకోవడం వలన యువతకు నైపుణ్య స్వావలంభన పొందడమే కాకుండా వారి తో పాటు వారి చుట్టుపక్కల వారికి కూడా ఉపాధి కలిగిస్తుందని పేర్కొన్నారు.
సంస్ధ డైరెక్టర్‌ ఎ.పూర్ణిమ మాట్లాడుతూ… సూక్ష్మ , చిన్నతరహా వ్యాపారాస్తులకు జన శిక్షణ సంస్ధాన్‌ నిర్వహిస్తున్న మహిళా ఉత్సవ్‌ ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని, ఎన్‌.టి.ఆర్‌ జిల్లా, విజయవాడ పరిసర ప్రాంతచిన్న తరహా మహిళ వ్యాపారులు సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్ధాన్‌ సిబ్బంది, మరియు శిక్షకులు, శిక్షాణార్ధులు తరుణీ తరంగాల సభ్యులు, విజయవాడ సభ్యులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *