-ఫారూఖ్ షిబ్లి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్న సందర్బముగా వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్, సమతా సైనిక్ దల్, LIC ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం, విద్యుత్ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంఘం, ఇన్కమ్ టాక్స్ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంఘం నాయకులతో సమావేశమై ఓటును అభ్యర్థించటం జరిగింది. ప్రజా సేవకులు, నిగర్వి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజారిటీతో గెలుపొందాలని అలాగే ఈ సంఘాలన్నీ పూర్తిగా ఆయనకు మద్దతుగా ఉంటాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ పేర్కొన్నారు.
గత ప్రభుత్వ అసమర్ధ పాలన వలన అభివృద్ధి పూర్తిగా కుంటుబడి, చేతగాని పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టివేసి చేసిన ఆర్ధిక విధ్వంసాన్ని ప్రజలు చూసారని, ప్రపంచ వ్యాప్తం నుండి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపనీలను పారిపోయేలా చేసి నేడు రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగ సమస్యలకు పూర్తీ భాద్యత గత ప్రభుర్వానిదే అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మరచిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయంలో తెలుగుదేశం MLCలు కనుక ఉండిఉండకపోతే ఈరోజున రాజధాని అమరావతి కనుమరుగై ఉండేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పార్టి తెలుగుదేశం అని, దేశ మరియు ప్రపంచములో తెలుగువారి ఖ్యాతిని, కీర్తిని పెంచిన మరియు పెంచబోయేది తెలుగుదేశం పార్టి అని అన్నారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసునని రేపు జరగబోవు పట్టభద్రుల ఎన్నికలకు ఈ విషయాలను మరియు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమర్ధవంతమైన పాలనకు సమర్ధవంతమైన నాయకునిగా ఎన్నుకునేందుకు నడుంకట్టి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని భారి మెజారిటితో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష్యులు ఫారూఖ్ షిబ్లి పిలుపు నిచ్చారు.
Prajavartha Online Telugu News