-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సేకరించిన వ్యర్థాలను నిర్వహణ సక్రమంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కొత్తవంతన జంక్షన్, సాంబమూర్తి రోడ్, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిత్యం ఇంటి వద్దనే వ్యర్ధాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, సేకరించిన వ్యర్థాలను అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వ్యర్ధ నిర్వహణ సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అక్కడున్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్ పనితీరును పరిశీలించారు, వ్యర్ధ నిర్వాహణలో ఎటువంటి లోపం ఉండకూడదని సేకరించిన వ్యర్థాలను క్రమ తప్పకుండా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో సక్రమంగా వ్యర్థ నిర్వహణ జరగాలని, వ్యర్ధాల నుండి ఎరువులు తయారు చేసే ప్రక్రియ, పూల వ్యర్ధాల నుండి అగరబత్తులు చేసే ప్రక్రియ, కొబ్బరి బోండాల వ్యర్ధాల నుండి కొబ్బరి పీచు దాని ఉత్పత్తులు తయారీ ప్రక్రియ నిత్యం జరుగుతూ ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానెటర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఇన్చార్జ్ వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసు పాదం, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News