-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025 -2026 సంవత్సరాలకు వ్యాపారస్తులందరికి ట్రేడ్ లైసెన్సు రెన్యువల్ చేసుకోవాల్సినదిగా, నోటీసులు ఇవ్వగా, వాటిని ఫిబ్రవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగరపాలక సంస్థకు సంబంధించిన వివిధ కౌంటర్ నందు లైసెన్సు రుసుమును కట్టించుకొనుచున్నారని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. డిమాండ్ నోటీసును సంబంధించిన సచివాలయాలలో రెన్యువల్ చేయించుకుని లైసెన్స్ కి చెల్లించవలెనని అన్నారు. మార్చి 1, 2025 నుండి మార్చి 31, 2025 లోపు చెల్లించిన వారు అపరాధ రుసుము కింద లైసెన్సు ఫీజు రుసుములో 25% అపరాధ రుసుముగా చెల్లించవలెనని, ఏప్రిల్ 1, 2025 నుండి చెల్లించువారు లైసెన్సు ఫీజులో 50% అపరాధ రుసుమును చెల్లించవలెనని, కావున ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 28 ఫిబ్రవరి 2025 లోపున లైసెన్స్ ఫీజు చెల్లించవలసినదిగా కమిషనర్ కోరారు.
Prajavartha Online Telugu News