-త్వరిత చర్యలతో అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చిన అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధరపురం, సితార సెంటర్‌లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో శీఘ్రంగా చర్యలు తీసుకున్నారని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్ ఉపయోగించి, శీఘ్రమైన చర్యలు చేపట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎస్టేట్ ఆఫీసర్, రిజినల్ ఫైర్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసారు, అలాగే జోనల్ కమిషనర్‌పై చార్జెస్ ఫ్రేమ్ చేసారు.
Prajavartha Online Telugu News