-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 15 కల్లా స్వయం సహాయక బృందాల ప్రోఫైలింగ్ ను పూర్తిచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం పెజ్జోనిపేట, పూర్ణానంద పేట, హార్ట్ పేట, పప్పుల మిల్ ప్రాంతంలో గల సచివాలయాలను సందర్శించి ఆర్.పి లు చేస్తున్న ఆన్లైన్ ఎస్. హెచ్. జి ప్రొఫైలింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల సభ్యుల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15 కల్లా వారి పరిధిలో ఉన్న అన్ని బృందాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. పెజ్జోనిపేట నివసిస్తున్న మురళీకృష్ణ నివాసంలో సూర్య ఘర్ లో భాగంగా ఇన్స్టాల్ చేసిన సోలార్ ప్యానల్స్ ను పరిశీలించారు.
Prajavartha Online Telugu News