-పరిసరాలు పరిశుభ్రత అందరి బాధ్యత
-జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రత – పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి నేతృత్వం లో జిల్లా లోని 7 అసెంబ్లీ నియోజకవర్గం లలో ఉన్న 7 స్కిల్ హబ్ లలోను, నైపుణ్య కళాశాల లోనూ శిక్షణ పొండుతున్న ట్రైనీలు హబ్ కోఆర్డినేటర్ తో కలసి ఉత్సాహం గా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం జీవనవిధానంలో ఏర్పడే వ్యర్థాలను, వాటి స్వరూప స్వభావ మూలాల ఆధారంగా వర్గీ కరించి వేర్పచి, విడివిడిగా సేకరించి, తిరిగి వాటిని విడివిడిగా సక్రమంగా నిర్వహించి, పునః చక్రీయ విధానాల ద్వారా, వాటిని వనరులుగా మార్చే ప్రయత్నంలో స్వచ్ఛత తో సుస్థిరంగా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛఆంధ్రకు ప్రతి ఒక్కరు స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కు నిర్దేశిత మార్గ దర్శక సూత్రాలు ను పాటిస్తూ కలసి పని చేయాలన్నారు.
సందర్భంగా జిల్లా లోని 7 అసెంబ్లీ నియోజకవర్గం లలో ఉన్న 7 స్కిల్ హబ్ లలోను, నైపుణ్య కళాశాల లోనూ శిక్షణ పొండుతున్న ట్రైనీలు హబ్ కోఆర్డినేటర్ తో కలసి ఉత్సాహం గా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతను చేపట్టారు.
“స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర” కార్యక్రమంలో APSSDC స్కిల్ కాలేజ్ కోఆర్డినేటర్, డాక్టర్ అల్లమరాజు శ్రీ రామచంద్రమూర్తి NAC AD జున్నూరు రాజు ల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సాహం గా DDU GKY ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News