స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం విజయవంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధి లో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం నందు స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆజ్ఞానుసారం కళాశాల అసోసియేట్ డీన్ ఇన్ఛార్జ్ Dr. ప్రవీణ గారు ఆధ్వర్యం లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తో పాటు అన్ని సంవత్సరాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డా. ప్రవీణ మాట్లాడుతూ విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే దుష్పరిణామాలు గురించి, అలాగే సమాజం లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వలన కలిగే స్వచ్ఛత మీద అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వంతు బాధ్యతగా సమాజంలో శుభ్రత కొరకు కృషి చేయాలని, సాటి ప్రజలకు పరిశుభ్రత యొక్క ఆవశ్యకత తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమం ఆఖరు లో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ అందరితో చేయించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *