Breaking News

ప్రపంచ దేశాల్లో మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది

-మన ప్రాంతంలో మంచి డిజైన్లతో రూపొందించిన మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాలను ఆదరిద్దాం.
-నగరంలో “మల్ఖా’ పులుగుర్త చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాల
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ సమకాలీన డిజైన్‌లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారులకు కొరకు నగరంలో మాల్ఖా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక అన్నపూర్ణమ్మ పేట, నేత బజార్ లో ‘మల్ఖా’ పులుగుర్త చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాలను మల్ఖా ట్రస్ట్ చైర్మన్ , వ్యవస్థాపకురాలు హుసురమ్మతో కలిసి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ మల్ఖా నూలుతో తయారు చేసిన వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందిందన్నారు. మల్ఖా బ్రాండ్ సాంప్రదాయ నేత పద్ధతులను మరియు చేనేత వస్త్రాలతో ముడిపడి ఉన్న సాంస్కృతిక, వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. ఇటువంటి ప్రత్యేక గుర్తింపు కలిగిన చేనేత వస్త్రాలను కాపాడుకోవడం మనపై ఉందన్నారు. పులుగుర్త చేనేత పరిశ్రమకు దీర్ఘకాలంగా  నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు వున్నారని, వారు  ఈ ప్రాంతం నుండి తయారు  చేసే ఉత్పత్తులు దేశీయంగాను, అంతర్జాతీయంగాను వినియోగదారులను ఆకర్షిస్తూన్నాయన్నారు.

యూరోపియన్ దేశాల్లో   ‘మల్ఖా’ పులుగుర్త చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మన జిల్లాలో మంచి డిజైన్లతో తయారు చేయబడే ఈ కాటన్ ఉత్పత్తులను , నేటి యువతను ఆకట్టుకునే విధంగా తయారు చేయడం జరుగుతోందని, మనమందరం ఆదరించి ఈ బ్రాండ్ పై ఆధారపడిన చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా ఈ విక్రయశాలను ఒకసారి సందర్శించి ఇక్కడ ప్రదర్శించిన కాటన్ ఉత్పత్తులైన సారీస్, చుడిదార్ మెటీరియల్, పంచేలు, షార్ట్స్ ఇతర వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం అన్నారు. ముఖ్యంగా యువత మన దేశీయ ఉత్పత్తులను ధరించి, ప్రోత్సాహం అందించాలని కోరారు. వివిధ ఆకర్షణీయమైన డిజైన్లతో రూపొందించిన వస్త్రాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఈ రంగం వైపు అడుగులు వేస్తున్న యువ చేనేత కళాకారులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ డిడి పి.పెద్దిరాజు, డి ఆర్ డి ఎ పి డి ఎన్.వి.వి.ఎస్ మూర్తి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, డెవలప్‌మెంట్ ఆఫీసర్ భాస్కర్ , ఏడిఓ లు శ్రీదేవి, వెంకటేశ్వర రావు, గురురాజు, మల్కా షాప్ మేనేజర్: డి.వి. వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *