-ఆర్ట్స్ కళాశాల, ఐ ఎస్ టీ, ఇంటర్, ఉన్నత పాఠశాలలకు చెందిన 63 విద్యార్థులకి బహుమతి ప్రధానం
-భద్రత, నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత
-ద్విచక్ర వాహన చోధకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి.
-వేగం కన్నా ప్రాణం మిన్న..
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భద్రత ప్రమాణాలు పాటించడం లో భాగంగా రోడ్డు ప్రమాదాలు, రహదారి నియమ నిబంధనలు పై నిరంతరం చర్చ జరగాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపు ఇచ్చారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2025 ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. తెలిసే అందరం ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించే తప్పులు చేస్తామని, అది మనకు ఒక అలవాటుగా మారిందని పేర్కొన్నారు. ఇతరులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వంక తప్పు చేసినట్లు చూస్తామని, అదే ట్రాఫిక్ నిబంధనలు మనం ఉల్లంఘిస్తే అదే కరెక్ట్ అనే భావన అనేది ఉండకూడదు అన్నారు. నిబంధనలు పాటించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరు రహదారి భద్రతా ప్రమాణాలను పాటించినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉందని తెలిపారు.
రహదారి భద్రత ప్రమాణాలను పాటిస్తున్నామా లేదా అన్నది, ప్రతి ఒక్కరూ ఎవరికి వారే స్వీయ ఆలోచన చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. వేగం కంటే ప్రాణం విలువైనది అన్న సత్యం అందరికీ తెలిసినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మనం చేసే కొద్ది పాటి నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలను కోల్పోయిన సందర్భాలను చూస్తూన్నామన్నారు. మనం చేసే తప్పు కంటే ఎదుటి వారు చేసిన తప్పు వలన ప్రమాదాల బారిన పడడం జరుగుతోందని, దీనివలన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు భవిష్యత్తు ఊహించలేమని కలెక్టర్ తెలియ చేశారు.
శబ్ద కాలుష్యం నేడు ఎదుర్కొంటున్న సమస్య లలో ప్రధాన కారణం సైలెన్సర్స్ నిబంధన ప్రకారం లేకపోవడం తద్వారా ఇతరులకు ఇబ్బంది కలగడం జరుగుతొందన్నారు. తల్లితండ్రులు పిల్లలకు రహదారి భద్రత నియమాలు పై అవగాహన కల్పించడం తప్పనిసరి. నేడు ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం అలవాటుగా మారిందన్నారు. యువత తమ వంతుగా చుట్టుపక్కల జరుగుతున్న ప్రమాదాలను, ఘటనలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండడం మరింత మందికి స్ఫూర్తిని కలిగించేలా ఉండాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలిసిన పాటించక పోవడం, వేగ నియంత్రణ సూచికలు ఉన్నా, వాటిని పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ, జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు, ఆర్ట్స్ కాలేజీ, ఎన్సీసీ విభాగం, ఇతర పాఠశాలలు, సన్ రైజర్స్ రైడింగ్ క్లబ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ముగింపు వేడుకల్లో వక్తృత్వం పోటీల్లో ఆర్ట్స్ కాలేజీ ఎమ్మెస్సీ విద్యార్థులు పిఎల్ శ్రీ హర్ష , జి దేవేంద్ర వర్మ , వి. సౌందర్య , ఆర్వీఎస్ ఆదిత్య నాయుడు లకు, వ్యాస రచన పోటీల్లో ఎమ్మెస్సీ విభాగంలో కే అయ్యప్పస్వామి, కే సత్యవాణి, ఎస్ కోకిల లక్ష్మి , సిహెచ్ కార్తీక్ , జూనియర్ ఇంటర్ విభాగంలో వి ఎస్ ఎస్ ఎల్ దుర్గా , కే సాయి , సిహెచ్ తేజస్వి , ఉన్నత పాఠశాల విద్యార్థులు జే జైత్ర శ్రీ , ఆర్ సాయి మణికంఠ , కే మాధుర , టీ దీక్షిత రమ్య , ఏ. జోషిత శ్రీ , డి సాత్విక , అగ్రికల్చర్ బీటెక్ విద్యార్థులు ఎస్ లలిత కుమారి , బి ఇందు తేజేశ్వని , ఇ. లోవ హర్షిణి లు విజేతలుగా నిలిచారు. కలెక్టర్ చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. సన్ రైజర్స్ రైడింగ్ క్లబ్ కు షీల్డ్ అందచేసారు. జిల్లాకు చెందిన 29 స్వచ్ఛంద సంస్థలు, ఆటో మొబైల్ కంపెనీలు , డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి, హెచ్, సంపత్ కుమార్, ఎమ్, రవికుమార్, జి. రాంనారాయన్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె. చైతన్య సుమా , పి. వి. వి. సాయి కుమార్, ఇతర ఆర్టీవో కార్యాలయం అధికారులు, సిబ్బంది , విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు , అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News