Breaking News

బొమ్మూరు వైటీసీలో డిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్..

-కీలక కార్యాలయాలు ఒకే చోట ఉండడం శుభ పరిణామం
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంలోజిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం బొమ్మూరు వై.టి.సి. కాంపౌండ్ లో వున్న భవనంలో డి.ఆర్.డి.ఎ (జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ) కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కే. సుజాత, సెక్రటరీ టీ. సత్యవతి, ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు , అ ఆర్ధిక చేయూత నందించే స్వయం సహాయక సంఘాల మహిళా సాధికారత లక్ష్యసాధన తో పాటు వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సత్వరము అందించడంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు సమయంతో పని చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు స్థిరమైన జీవనోపాధికి ప్రాధాన్యతనిస్తూ సమాజ అభివృద్ధి కీలక పాత్ర పోషించాలన్నారు. కలెక్టర్ ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సంక్షేమ కార్యక్రమాలపై సంక్షిప్తంగా సమీక్షించారు.

అనంతరం వై టి సి కాంపౌండ్ లో ఉన్న డ్వామా, జిల్లా పరిశ్రమలు, జిల్లా పంచాయతీ, మైక్రో ఇరిగేషన్, సమాచార పౌర సంబంధాలు, జిల్లా స్పోర్ట్స్ కార్యాలయం సందర్శించి వారికి ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. పీడీ ఛాంబర్ ను జిల్లా కలెక్టర్, స్టాఫ్ రూమ్ ను జిల్లా సమాఖ్య అధ్యక్షులు కే. సుజాత, సెక్రటరీ టీ. సత్యవతి లతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి ఎన్ వివి ఎస్ మూర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కే. సుజాత, సెక్రటరీ టీ. సత్యవతి , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ . మాధవరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అప్పలకొండ, జిల్లా స్పోర్ట్స్ అధికారి, ఎల్ డి ఎం ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి. శాంతమణి, డి ఐ వో – శ్రీవనిదర్ రామన్, డ్వామా పీడీ ఏ నాగమహేశ్వర రావు, డిపిఆర్వో ఐ కాసయ్య, ఏపీఎం లు, ఈవో డ్వాక్రా, ఇతర సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *