Breaking News

ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్నిమరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. అక్కడ ఖైదీలకి అందచేస్తున్న ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఇందుకోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్ల ద్వారా తమ అర్జీలను అందించాలని అన్నారు. ముద్దాయిలు, ఖైదీల గురించి పనిచేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *