– ఎన్టీఆర్ జిల్లాలో 78,063 మంది పట్టభద్రుల ఓటర్లు
– 11 అనుబంధ పోలింగ్ స్టేషన్లతో సహా మొత్తం 112 పోలింగ్ స్టేషన్లు
– ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేస్తున్నాం
– ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలో ఓటర్లు, పోలింగ్ స్టేషన్ లొకేషన్లు, ఆగ్జలరీ పోలింగ్ స్టేషన్లు తదితరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 78,063 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుషులు 45,425 మంది కాగా మహిళలు 32,625 మంది, టీజీ ఓటర్లు 13 మంది ఉన్నట్లు వివరించారు. 11 అనుబంధ పోలింగ్ స్టేషన్లతో సహా మొత్తం 112 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మార్చి 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. అప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని, జిల్లావ్యాప్తంగా ఎంసీసీని పటిష్టంగా అమలుచేస్తున్నామన్నారు. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే క్రమంలో కలెక్టరేట్లో 0866 – 2575822 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూం పనిచేస్తోందని.. ఉల్లంఘనలపై ఈ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అభ్యర్థులు అనుమతుల మేరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఓటర్లకు ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, ఎంసీసీ నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు, స్వీప్ నోడల్ అధికారి యు.శ్రీనివాసరావు, పి.ఏసుదాస్ (ఐఎన్‌సీ), డీవీ కృష్ణ (సీపీఎం), వై.రామయ్య (టీడీపీ), కె.పరమేశ్వరరావు (ఏఏపీ), వై.ఆంజనేయరెడ్డి (వైఎస్ఆర్సీపీ), కె.తరుణ్ (బీజేపీ), కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News