Breaking News

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలి…

-బొప్పరాజు, వేల్పులు అర్లయ్య, పలిశెట్టి, జి.జ్యోతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటు వంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్దలో వ్యవస్థీ కృతమైన కొన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వం భావించి, ఈ సచివాలయ వ్యవస్దలో ఏ ఉద్యోగికి నష్టం కలగకుండా, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని భావించి, ప్రభుత్వం చేపట్టాల్సిన సంస్కకరణలను అమలు చేసేందుకు గాను సోమవారం సచివాలయంలో సంబందిత శాఖామాత్యూలు డోలా బాల వీరంజనేయ స్వామి  ఆద్వర్యంలో ఉన్నతాధికార్లు సమక్షంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముందు మంత్రిని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో ఏపిజేఏసి అమరావతి అనుబంద సంఘం అయిన గ్రావార్డు, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్ద రాష్ట్ర అధ్యక్షులు వెల్పుల అర్లయ్య, రాష్ట్రకోశాధికారి జి.జ్యోతి కలసి సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సర్వీస్ విషయాలపట్ల తీసుకోవల్సిన చర్యలుపై లేఖ ఇచ్చారు.

అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్ద రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య, రాష్ట్ర కోశిధికారి జి.జ్యోతి సమావేశంలో మాట్లాడుతూ….

హేతు బద్ధీకరణ ప్రక్రియలో ఇచ్చిన జిఓ.యం.యస్.నెంః1 క్లాస్ 3.ఏ లో విసదీకరించిన విధంగా మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ మరియు యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఎవరెవరు ఏ కేటగిరీ కింద వస్తారో పూర్తి సమాచారం తెలియచేయాలని విజ్ఞప్తి చేసారు.

అలాగే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో 3501 పై పడి జనాభా ఉన్న సచివాలయాలకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున, 3501 జనాభా దాటి పెరిగే ప్రతి 500 లేదా 1000 మంది జనాభా కు అదనంగా ఒక సచివాలయ ఉద్యోగిని అదనంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

వివిధ హోదాలలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులలో.. ఎంతమందిని మల్టీపర్పస్, టెక్నికల్ (6 లేదా 7 లేదా 8 క్యాటగిరి కి సంబంధించిన సచివాలయాలలో) ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారో ఉద్యోగులకు తేలియచేయాలని విజ్ఞప్తి చేసారు.

అంతేకాకుండా 2023 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించిన ఆస్పిరేషన్ బ్లాక్స్ మరియు ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంకు అనుబంధంగా కొత్తగా ఇప్పుడు ఆస్పిరేషన్ ఫంక్షనరీస్ క్రింద తీసుకుంటున్నారా అనే విషయం పై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అటువంటి ఉద్దేశం ఉంటే ఈ ఆస్పిరేషన్ సెక్రటరీ అని పిలవడానికి బదులు “ప్రోగ్రెసివ్ సెక్రటరీగా” పిలిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు.

సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే తమ సంవత్సరాంత ఇంక్రిమెంట్లతో జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ చేరువలో ఉన్నందున, వారందరికీ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్స్ ఇవ్వడం వలన ప్రభుత్వంపై ఎటువంటి అధిక భారం కలగదు కనుక వారందరికి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇచ్చే విషయంను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోని సచివాలయ ఉద్యోగుల న్యాయం చేయాలని మనవి చేసారు.

ఇదిలా ఉండగా 2022లో ఇచ్చిన 11వ పిఆర్సి ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ నెంబర్ 2 లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించిన జీత భత్యాలు 2015 పిఆర్సి లోవి యధాతధంగా ఉంచడం జరిగింది. అటువంటి తప్పు మరలా పునరావతం కాకుండా రాబోయే 12వ పీఆర్సీ లో తగు చర్యలు తీసుకోవాలని కోరారు .

రాష్ట్రంలో అత్యధికమంది సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఉద్యోగం పొందిన కారణంగా ఇప్పటివరకు చాలామంది ఫంక్షనరీస్ సరైన ప్రమోషన్ నోచుకోనందున, వీళ్ళందర్నీ వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసి ప్రమోషన్ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులు చాలామంది జీవిత భాగస్వామిలు వివిధ జిల్లాలలో ఉద్యోగలు చేయడం వలన కుటుంబ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అటువంటి ఉద్యోగస్తులందరికీ పరస్పర మరియు భాగస్వామ్య బదిలీలు త్వరితగతిన చేపట్టవలసినదిగా విజ్ఞప్తి చేసారు.

ఈసమావేశంలో రాష్ట్రంలో పలు గ్రామవార్డు సచివాలయం ఉద్యోగసంఘాలు నాయకులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *