Breaking News

నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నీ 2 రోజుల్లో పూర్తి అయ్యేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. మంగళవారం సర్వేల వేగవంతంపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలైన మిస్సింగ్ సిటిజన్, జియో కోఆర్డినేట్, నాన్ రెసిడెంట్ ఏపి లను 20వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. నోడల్ అధికారులు 2 రోజుల పాటు సర్వేలు పూర్తి చేయించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కార్యదర్శి విధుల్లో ఉండేలా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై నోడల్ అధికారులు రిపోర్ట్ ఇస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. సెలవులో ఉండే కార్యదర్శుల స్థానంలో ఇంచార్జ్ లను నియమించి సర్వే చేయించాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *