గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులకు వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసు జారీ చేసినపట్టికీ, అంతర్గతంగా పనులు జరుగుతుండం, కేటాయించిన విధుల్లో పర్యవేక్షణ లోపంపై స్థానిక వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి, టిపిబిఓలను విధులను సస్పెండ్, టిపిఎస్, ఏసిపి, డిసిపి, సిటి ప్లానర్లలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక పట్టాభిపురం మెయిన్ రోడ్ లో నిర్మాణంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టకపోవడంపై జిఎంసి వర్క్స్ స్టాప్ ఆర్డర్ నోటీసు జారీ చేసి, స్థానిక పట్టణ ప్రణాళిక అధికారులను పనులు జరగకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించామని తెలిపారు. అనంతరం పనులు అంతర్గతంగా జరుగుతున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు జిఎంసి అదనపు కమిషనర్ నేతృత్వంలో కమిటి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కమిటి ప్రాధమిక నివేదిక, మంగళవారం తమ క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసు అందిన అనంతరం కూడా పనులు జరిగాయని నిర్దారించడం జరిగిందని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంపై స్థానిక వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి సిహెచ్.జగన్మోహనరావు, టిపిబిఓ కె.నిఖిల్ వంశీలను విధుల నుండి సస్పెండ్ చేస్తూ, పర్యవేక్షణ అధికారులైన టిపిఎస్ సత్యనారాయణ, ఏసిపి రెహ్మాన్, డిసిపి సూరజ్ కుమార్, సిపి రాంబాబులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసులు అందిన తర్వాత కూడా పనులు చేపట్టిన భవన యజమానిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Prajavartha Online Telugu News