-పెండింగ్లో వున్న పెన్షన్, జీపీఎఫ్ అంశాలను పరిష్కరిస్తాం.
-పెన్షన్, జీపీఎఫ్ అదాలత్, ఎజి ఆడిట్ పేరా ల కౌంటర్ల ఏర్పాటు
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి,
-రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ&ఇ) ఎస్.శాంతి ప్రియ
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్ ఫలవంతమైన దిశగా నిర్వహించుకోవడం శుభ పరిణామం , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ&ఇ) ఎస్.శాంతి ప్రియ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్, ఇతర అనుబంధ సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమం రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ&ఇ) నేత్రుత్వంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన జరిగింది.
జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సర్వీస్ సమయంలో తన సర్వీస్ కు సంబందించిన అన్ని అంశాలు తన సర్వీస్ రిజిస్టర్ నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ) కార్యాలయం వారు జిల్లాలో నిర్వహిస్తున్న పెన్షన్స్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని పెన్షనర్లు, డిడిఓ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ&ఇ) ఎస్.శాంతి ప్రియ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించాలాన్నారు. అలా చేయడం వలన ఆ ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొందుతారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, పాడేరు, తిరుపతి, ఏ.పి. సెక్రటేరియట్ వెలగపూడి, ఏ.పి.డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళగిరిలోను పెన్షన్ మరియు జిపిఎఫ్ అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
పెన్షనర్ల పదవి విరమణ చేసే కంటే ఆరు నెలలు ముందు పెన్షన్ పేపర్లు అకౌంటెంట్ జనరల్ కి పంపాలని సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పోలు కిషోర్ రెడ్డి తెలిపారు. 40 శాతం మంది పెన్షన్ పేపర్లు పదవీ విరమణ చేసిన నాలుగు నెలల తర్వాత పెన్షన్ పేపర్లు సమర్పించడం వల్ల లేటుగా బెనిఫిట్స్ వస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్.మోహన్ రావు మాట్లాడుతూ, పదవీ విరమణ కు సంబంధించి ప్రతిపాదనలు ముందస్తుగా సిద్ధం చేసుకొని అకౌంటెంట్ జనరల్ కి సిఫార్సు చేయాలని కోరారు. డిడివో సక్రమంగా ప్రతిపాదనలు పంపితే ఎటువంటి జాప్యం లేకుండా అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి సకాలంలో పెన్షన్, ఇతర బెనిఫిట్స్ విడుదల చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది పాత పెన్షన్ పొందుతున్నారు, వాటికి సంబంధించి ఆయా డ్రాయింగ్ అధికారులు ప్రతిపాదనలు సిఫార్సు చేస్తే ప్రస్తుత పిఆర్ సికి అనుగుణంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు, అధికారులు, ఉద్యోగులు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగింది. పెన్షన్ మంజూరులో అకౌంటెంట్ జనరల్ సేవలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ఏజీ వారు క్షేత్ర స్థాయిలో నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ&ఇ) ఎస్.శాంతి ప్రియ అందజేశారు.
కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్.మోహన్ రావు, అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ) కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్)పి. కిషోర్ రెడ్డి పోలు, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అర్హతలు) వి. లలిత్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్,/పెన్షన్స్, జి.సునీత, టి. విజయ్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్/జిపిఎఫ్. డి చంద్ర శేఖర్, హాజరవుతున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News