-జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీ లను గుర్తించాలి.
-కడియపులంక ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం ఒక కిలో మీటర్ తో చేపట్టి, దశల వారీగా నిడివి పెంచాలి.
-జాతీయ రహదారి 216-ఏ పర్యాటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్‌ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలి.
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధానం చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యాటక కమిటీ (DTC) సమావేశం కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించగా, ఇంచార్జి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీ లను గుర్తించి ప్రత్యేక ప్రతిపాదనలతో చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి 216-ఏ పర్యటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్‌ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలన్నారు. కడియం నర్సరీలు, ఫ్లవర్ మార్కెట్ వర్గాలు, స్వయం సహక సంఘాలు, చేనేత కుటుంబాలను గుర్తించి లీజ్ పద్ధతిలో షాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పొట్టిలంక నుండి కడియావు లంక వరకు కేటాయించబడిన స్టాల్స్ నిర్దిష్టమైన పరిణామంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నీరు, విద్యుత్, సిసి కెమెరా సౌకర్యం కల్పించాలని సూచించారు.
లీజు ధర విషయంలో కమిటీ మరోసారి సమావేశాన్ని నిర్వహించి లీజు ధరను నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి చూపుతున్న వర్గాల నుంచి దరఖాస్తులని స్వీకరించే విషయంలో నర్సరీ అసోసియేషన్ అభ్యర్థించిన బిడ్డింగ్ సమయం దరఖాస్తుల ఆహ్వానాల కోసం తగిన సమయం ఇవ్వాలని స్పష్టం చేశారు.
సాధ్యత అంశాల మేరకు పర్యాటక రంగం అభివృద్ధికి దశల వారీగా ప్రణాళికలతో కూడిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడియపులంక ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం ఒక కిలో మీటర్ తో చేపట్టి, దశల వారీగా నిడివి పెంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. వేమగిరి నుండి కడియపులంక కెనాల్ వరకు 10 సీట్ల డీలక్స్ బోట్స్ ఏర్పాటు శిల్పారామం సొసైటీని అభివృద్ధి చేసేందుకు కడియపు లంకలో అనువైన భూమిని గుర్తించాలన్నారు. హేవ్‌లాక్ వంతెన కోసం మార్పిడి ప్రక్రియను , టూరిజం బడ్జెట్ హోటల్‌ను అభివృద్ధి చేయడానికి , 5 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిని గుర్తించడం, బ్రిడ్జ్ లంక ద్వీపంలో టూరిజం అడ్వెంచర్ కార్యకలాపాలను , ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిర్వహణ కార్యకలాపాలు , ట్రీ హట్స్, గ్లాస్ హౌస్ లతో కూడి పర్యటక ప్రాంతాలు గా తీర్చిదిద్దాలన్నారు. కడియం నర్సరీ లకు సంబంధించిన కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి చెందిన డీపిఆర్ లు సిద్ధం చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. నగర వనం తదితర పర్యాటక ప్రదేశాల్లో అభివృద్ధి, విడిది , సాహస క్రీడలు ఏర్పాటు చేయాలని సూచించారు.
రంపచోడవరం పరిధిలో ఈకో టూరిజం ఆధారిత ప్రాజెక్టు లతో కూడిన పలు అభివృద్ధి పనులు ఈ ప్రాంతానికి అనువైన వాటిని అడాప్ట్ చేసుకోవడానికి సాధ్య సాధ్యాలు ప్రతిపాదనలు, నగర పాలక సంస్థ కమీషనర్ తో సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందచేయాలని డి ఎఫ్ వో రవీంద్ర దామా ను కోరారు.
ఈ సమావేశం లో ఇంచార్జి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా, జిల్లా రెవిన్యూ అధికారి టీ సీతారామ మూర్తి , జిల్లా పర్యటన అధికారి పి వెంకట చలం, జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారి ఏ. దుర్గేష్. ఇరిగేషన్ ఎస్ ఈ – కే. గోపీనాథ్ , కడియం నర్సరీ నూతన అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప , ఆర్ ఎం సి అదనపు కమీషనర్ పివి రామలింగేశ్వర, ఆర్ ఎం సి ఎస్ ఈ – జీ. పాండురంగ రావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ బి సుజాత కుమారి, కడియం ఇంచార్జి తసీల్దార్ సునీల్ , ఎంపీడీవో టూరిజాం అధికారులు, వివిధ ఏజెన్సీ ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News