-శాఖల వారీగా ఇచ్చిన డేటా నవీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వే సమయంలో ఇంటి వద్ద లేని సిటిజన్ల హౌస్ హోల్డ్ డేటా పెండింగ్ లేకుండా ప్రతి శాఖాకు చెందిన లబ్ధిదారుల, అర్హుల జాబితాను అనుసరించి క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మిస్సింగ్ హౌస్ హోల్డ్ పై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , జిల్లాలో 1,65,278 మంది మిస్సింగ్ హౌస్ హోల్డ్ ఉన్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికీ ఇంకా 48,232 మంది వివరాలను గుర్తించి డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉందన్నారు. ఇందులో నూరుశాతం మిస్సింగ్ హౌస్ హోల్డ్ గుర్తించడం లో భాగంగా వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు సచివాలయాలు వారిగా గుర్తించి నవీకరించాలన్నారు. శాఖల వారీగా విద్యుత్ శాఖ 16,082 , పౌర సరఫరాల శాఖ 7,889 , విద్యా శాఖ 5,799 , ఆరోగ్యశ్రీ 5,426 , డ్వామా 4,685 , సర్వే 4,677 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఆధార్ నెంబర్, ఫోన్ నంబర్ ఆధారంగా వారి వివరాలు సేకరించి నవీకరణ చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా ఇచ్చిన డేటా నవీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, వొచ్చే వారం లో మెరుగైన ఫలితాలు రావాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి టీ సీతారామ మూర్తి , డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు పి వీణాదేవి, ఏ . శ్లివా రెడ్డి , డ్వామా పీడీ ఏ నాగమహేశ్వర రావు, ఏపీ ఈపిడిసిఎల్ కే తిలక్ కుమార్, జిల్లా సర్వే అధికారి బి. లక్ష్మి నారాయణ , జిల్లా పాఠశాల విద్యా అధికారి ఎస్. వాసుదేవరావు , జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జీవీఎల్ సుబ్రహ్మణ్యం , ఐ సి డి ఎస్ పిడి కె. విజయ కుమారి , ఆరోగ్య శ్రీ కో ఆర్డీనేటర్ పి ప్రియాంక , టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News