Breaking News

ఆయిల్ పామ్ తోటల పెంపకం 63 శాతం లక్ష్య సాధనపై అసంతృప్తి

-ఫిబ్రవరి చివరి నాటికి 80 శాతం వృద్ధి చూపాలి
-మార్చి 31 నాటికి ఏజెన్సీస్, హార్టికల్చర్ అధికారులు నూరుశాతం సాధించాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల ప్రగతి లక్ష్యలను ఏజెన్సీ ప్రతిపాదించినా మేరకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, ఆ మేరకు వాటిని మార్చి నాటికి వంద శాతం పూర్తి చెయ్యాలని కలెక్టర్ పి ప్రశాంతి ఏజెన్సీస్ లను, అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రగతి లక్ష్యాల పై సంబంధిత ఏజెన్సీలు, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్ అధికారులతో , హార్టికల్చర్ క్షేత్ర స్థాయి అధికారుల పనితీరుపై సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల ప్రగతి లక్ష్యలను నిర్దేశించుకున్న వాటిలో 63 శాతం మాత్రమే పూర్తి చేయ్యడంపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం,ఏజెన్సీ లతో సమన్వయ లోపం కారణంగా పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్‌పాం తోటల సాగు బాగా పెరిగితే వంట నూనెల దిగుమతి వ్యయం తగ్గుతుందన్న యోచనతో, కేంద్రం ఈ సాగును ప్రోత్సహిస్తోందన్నారు. ఇంత ప్రోత్సాహమున్నా జిల్లాలో 63 శాతం మాత్రమే లక్ష్య సాధనపై ఉద్యాన శాఖ అధికారులు సంబంధిత ఏజెన్సీలపై పనితీరు పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆయిల్‌పాం సాగు, పామాయిల్ ఉత్పత్తిపై సరైన పరిజ్ఞానం, అవగాహన లేనివారికి పంట సాగును ప్రోత్సహించాలని నిర్దేశించి ఉద్యాన శాఖ మిన్నకుండిపోవడం కూడా లక్ష్యం చేరకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నారు. నిర్దేశించిన లక్ష్యలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యం మేరకు ఫలితాలు సాధించని ఏజెన్సీ కు షో కాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. రుచి సోయా , సర్వసాయి, నవ భారత్, 3 ఎఫ్ కంపెనీ లను మార్చి 31 లోగా లక్ష్యాలను చేరుకోవాలని, లేని పక్షంలో బ్లాక్ లిస్టు కు సిఫార్సు చేస్తామని తెలిపారు. రాబోయే ఏడాది ఆయిల్ పామ్ పంటలు లక్ష్య సాధనలో ఖచ్చితం ఉండాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు.

మండలాలు వారీగా హార్టికల్చర్ ఆఫీసర్ పనితీరు పై సమీక్ష చేస్తూ 4650 హెక్టార్ల కు 3354 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. లక్ష్య సాధనలో నిర్లిప్తత కలిగి ఉంటే ఎలా అంటూ, గ్రామ స్థాయి లో తక్కువ ప్రగతి సాధించిన గ్రామ హార్టికల్చర్ సిబ్బంది జాబితా ఇవ్వాలని, మండల హార్టికల్చర్ ఆఫీసర్ లకు షో కాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి బి. సుజాత , జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గేష్, నవభారత్, 3ఎఫ్ ఆయిల్ పామ్, సర్వ సాయి రుచి సోయా ఏజెన్సీలు , మండల హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *