Breaking News

ధ్రువపత్రాల జారీపై అవగాహనా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ధ్రువపత్రాల జారీపై అవగాహనా కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ .శ్రీలక్ష్మి. ధ్రువపత్రాల జారీ పై అవగాహనా కార్యక్రమం.స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో గల కోర్టు హాల్ లో, బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీ ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, సకాలంలో జనన, మరణ, పెళ్లి, ఆదాయ ధ్రువ పత్రాల జారీ పై, మునిసిపల్, సచివాలయ సిబ్బంది నిబద్ధత కలిగి ఉండాలని సూచించారు. వివిధ ధ్రువ పత్రాలను సకాలంలో పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, వాటి వలన ఒనగూరే ప్రయోజనాలు , వాటి ఆవశ్యకత గురించి వివరించారు. సబ్ రిజిస్ట్రార్ ఆర్ రాంబాబు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో, పెళ్లి ధ్రువ పత్రంతప్పని సరిగా తీసుకోవడం ఎంతో అవసరమని, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అన్నారు. పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గాయత్రి దేవి మాట్లాడుతూ, జాతీయ లోక్ అదాలాత్ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. డి ఎల్ ఎస్ ఏ ప్యానెల్ న్యాయవాది డి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, పేద ప్రజలు ఏవిధమైన న్యాయ సేవలనైనా, డి ఎల్ ఎస్ ఏ ద్వారాఉచితంగా పొందవచ్చని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *