Breaking News

పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకంపై అవగాహన కలిగి ఉండి ఉద్యోగులను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అన్నారు.

ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకం పై ఉద్యోగులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో గ్రంథాలయ సంస్థ, ఫైర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల బారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ బిజిలి యోజన పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో లబ్దిదారులు ఇంటి పై సోలార్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తయారైన విద్యుత్‌ను ఉచితంగా గృహ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లింపులు చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు.
మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చునని తెలిపారు.
బ్యాంకు నుండి రుణం పొందిన లబ్దిదారులు సూర్యఘర్‌ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకుని ప్రతి నెల సాదరణ విద్యుత్‌ బిల్లు చెల్లించడం ద్వారా ఆదా అయ్యే సొమ్మును బ్యాంక్‌ రుణం కింద చెల్లిస్తే రుణం తీరుతుందన్నారు. ఇంటి కప్పుపై ప్రభుత్వ రాయితీతో పాటు అతి తక్కువ ఖర్చుతో సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకొని ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకుని కరెంట్‌ బిల్లుల భారాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడం ద్వారా కాలుష్య రహితపర్యావరణ హిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డిఆర్ ఓ కె.చంద్రశేఖర రావు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి సాయిబాబు, కలెక్టరేట్ ఏవో సిహెచ్. వి. ఆంజనేయ ప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీ వి.రవికుమార్ ఉద్యోగులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *