Breaking News

కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ కి లారీ ఓనర్ల లేఖ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర బడ్జెట్ చరిత్రలో మధ్యతరగతి వర్గానికి ముఖ్యంగా వేతనజీవులకు మున్నెన్నడూ లేనివిధంగా ఎన్డీఏ ప్రభుత్వం వరాలు కురిపించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ అన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని నోవో టెల్ హోటల్ లో కేంద్రబడ్జెట్ పై ఏర్పాటుచేసిన సమీక్షా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులు కేంద్రబడ్జెట్ పై చర్చలో పాల్గొన్నారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ఏపీ లారీ ఓనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు మాట్లాడుతూ చమురు అమ్మకాలపై జిఎస్టి ఎత్తివేయడంలో కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తోందని,రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపిస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రవాణారంగం మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి దృష్టికి తెస్తూ ఏపీ లారీ ఓనర్స్ పక్షాన లేఖ అందచేశారు. శాసనసభ్యులు సుజనాచౌదరి ఈ చర్చాకార్యక్రమం పర్యవేక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *