Breaking News

రాజమహేంద్రవరం రూరల్ ఏం ఎస్ ఎల్ పాయింట్ ఆకస్మిక తనిఖీ

-బఫర్ గోడౌన్ నుంచి వచ్చే స్టాక్ నిర్ధారణ చేసుకోవాలి
-ఆర్డీవో కృష్ణ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం ఎస్ ఎల్ పాయింట్స్ నుంచి బియ్యం ప్రజా పంపిణీ కోసం సరఫరా చేస్తున్న దృష్ట్యా తూకం ఖచ్చితంగా ఉండేలా సరి చూసుకోవాలని రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ స్పష్టం చేశారు.

శుక్రవారం సాయంత్రం రూరల్ పరిధిలోని పౌర సరఫరాల ఎం ఎస్ ఎల్ పాయింట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ, ఎం ఎస్ ఎల్ పాయింట్ వద్ద ఉన్న బియ్యం స్టాక్ కు సంబంధించి ప్రతి బస్తా 50 కేజీలు, గన్నీ బ్యాగు బరువు కాకుండా ఉండాలన్నారు. సాధారణంగా గన్ని బ్యాగు బరువు 580 గ్రాములు ఉంటుందని తెలిపారు. పరిశీలన సమయంలో కొన్ని బియ్యం బస్తాల బరువు 50 కేజీలు, 49.800 కేజీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏం ఎస్ ఎల్ పాయింట్ నుంచి చౌక ధరల దుకాణాలకి పంపిణీ చేసే విధానం లో గన్ని బ్యాగు బరువు కాకుండా 50 కేజీలు ఉండాలని తెలిపారు. బఫర్ స్టాక్ గోడౌన్ నుంచి తీసుకుని వచ్చే సందర్భం లో సరి చూసుకునే బాధ్యత ఎం ఎస్ ఎల్ పాయింట్ ఇంచార్జి దే అన్నారు. లోడ్ మొత్తం బరువును బట్టి స్టాక్ నమోదు చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా రూరల్ తసీల్ధార్ కుమార్, ఎం ఎస్ ఎల్ పాయింట్ ఇంచార్జి డి టీ శ్రీనివాస్ , పౌర సరఫరాల సంస్థ అధికారులు సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *