విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు 2025 ను పురస్కరించుకొని శ్రీ శైలం భ్రమరాంబసమేత మల్లికార్జున స్వామి వారికి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరుల తరపున తేదీ 23.02.2025 సాయంత్రం ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ శైలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రావు, వేద పండితులు, అర్చకులు విజయవాడ నుండి విచ్చేసిన బృందాన్ని స్వాగతించి, ఆలయ మర్యాదలతో ఆలయం లోనికి తోడ్కోని వెళ్లారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద ఆశీర్వచనం జరిగింది. ఈ కార్యక్రమం లో విజయవాడ ఆలయ స్థానాచార్య శివ ప్రసాద శర్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News