-అప్టస జిల్లా అధ్యక్షులు కాకాని నాగేశ్వరరావు
-ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ ఎకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా
-ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
-నూతన కార్యవర్గాన్నిఅభినందించిన ఉద్యోగ సంఘాల నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అపరిష్కృతంగా ఉన్న ఖజానా విభాగం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ ఎకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా సంఘ నూతన కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని సంఘ నూతన అధ్యక్షులు కాకాని నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఖజానా శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఆదివారం గవర్నర్ పేటలోని ఖజానా శాఖ కార్యాలయంలో ఎన్నికల అధికారి షేక్ హసీనా బేగం నిర్వహించారు. జిల్లా కార్యవర్గంలోని 11 పదవులు ఒక్కొక పదవికి ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేసినందున కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ఆమె తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షులు గా కాకాని నాగేశ్వరరావు కార్యదర్శిగా ఏలూరి నరేష్ (సీనియర్ అకౌంటెంట్, జగ్గయ్యపేట) సహాధ్యక్షులుగా కె. మల్లేశ్వర రావు (విజయవాడ ఎస్టిఓ), ఉపాధ్యక్షులుగా అర్షద్ ఒమర్ (తిరువూరు ఎస్టిఓ), బి. సరళ కుమారి (సీనియర్ అకౌంటెంట్, విజయవాడ), ఎండి జమీలున్నీసా (సీనియర్ అకౌంటెంట్, విజయవాడ), కార్యదర్శిగా ఎం. ప్రవీణ్ బాబు (సీనియర్ అకౌంటెంట్, విజయవాడ), కార్యనిర్వాహక కార్యదర్శిగా అబ్దుల్ వదూద్, సంయుక్త కార్యదర్శులుగా బి. చిన్న నిర్మల, వి. శ్రీనివాస్, ఎన్. భార్గవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ సభ్యులు తమ మీద ఉన్న నమ్మకం తో ఏకగ్రీవం గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.ఖజానా శాఖ ఉద్యోగుల సమస్యల రాష్ట్ర సంఘం నాయకుల దృష్టికి, ఏపీ ఎన్జీజీవో రాష్ట నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో ఖజానా శాఖ ఉద్యోగులు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా ఫయాజ్ అహమ్మద్, పరిశీలపరాలిగా జె. కరుణ వ్యవహరించారు. నూతన కార్యవర్గానికి పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఖజానా శాఖ అధికారులు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News