Breaking News

జిల్లాలో ప్ర‌శాంతంగా ముగిసిన గ్రూప్‌-2 మెయిన్స్

-పేప‌ర్‌-1కు 83.89 శాతం, పేప‌ర్‌-2కు 83.62 శాతం హాజ‌రు
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ)- గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ‌లో 19 కేంద్రాల్లో 8,792 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయ‌గా.. ఉద‌యం జ‌రిగిన పేప‌ర్‌-1కు 83.89 శాతం (7,376), మ‌ధ్యాహ్నం జ‌రిగిన పేప‌ర్‌-2కు 83.62 శాతం (7,352) మంది హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో భాగ‌స్వాములైన కోఆర్డినేటింగ్‌, క‌స్టోడియ‌న్‌, రూట్‌, లైజ‌నింగ్ అధికారులు త‌దిత‌రుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్ల‌కు తావులేకుండా ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో భాగ‌స్వాములైన రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌, ప్రజా రవాణా త‌దితర శాఖ‌ల అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ లక్ష్మీశ వెల్ల‌డించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *