విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ ధారా విక్రం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటాలు చేసిన వారు కానీ, రాజకీయాలకు చెందిన వారు కానీ ఉండకూడదని, వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారే పెద్దల సభలో ఉండాలని కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ ధారా విక్రమ్ అభిప్రాయపడ్డారు. గత 20 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయని వెల్లడించారు. తనని ఎన్నుకోవడం ద్వారా రాజ్యాంగ విలువలు కాపాడతానని, ఎన్నికైన ముఖ్య ఉద్దేశానికి న్యాయం చేస్తానన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు రాజ్యాంగ స్ఫూర్తిని మరచి రాజకీయ పార్టీలకు అంకితమయ్యారన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రులు అన్యాయమయ్యారన్నారు. 2006 తర్వాత విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేదన్నారు. నోటిఫికేషన్ ఇచ్చినా నియామకాలు జరగలేదన్నారు. ప్రభుత్వాలు మారినా ఉద్యోగ కల్పన లేకపోవడంతో చదువుకున్న వారు వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వలస పోతున్నారన్నారు. తనను గెలిపించడం ద్వారా పట్టభద్రులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. సీరియల్ నెంబర్ 15 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News