Breaking News

పర్యవేక్షణ అధికారులకు శిక్షణ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓట్లు ఏకగ్రతతో, సమర్ధవంతంగా , ఖచ్చితంగా, సత్వరమే లెక్కింపు చేయాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజు లతో కలసి శాసన మండలి కౌంటింగ్ కేంద్రంలో విధులు కేటాయించిన ఓట్లు లెక్కింపు సిబ్బంది, టేబుల్ సూపర్వైజర్లు, రో ఇన్చార్జ్ లు, పర్యవేక్షణ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ శాసన మండలి ఎన్నికలు బ్యాలెట్ పేపరు, మొదటి ప్రాధాన్యత ఓటు నమోదు విధానం ద్వారా జరుగుతున్న నేపథ్యంలో ఓట్లు లెక్కింపు చాలా జాగ్రత్తగా చేపట్టాలన్నారు. అదే విధంగా శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్ధి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు అధికంగా రావాల్సి ఉంధన్నారు. దీనికి కోసం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు సమయానికి నిర్దేశిత ఆధిక్యం రాకపోతే, పోటీలో ఉన్న అతి తక్కువ మెజార్టీ వచ్చిన అభ్యర్దుల ఓట్లలో తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్ధులకు కేటాయిస్తూ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. శాసన మండలి ఎన్నికలు 483 పోలింగ్ బూత్ లలో నిర్వహిస్తున్నందున ఓట్లు లెక్కింపుకు 28 టెబుల్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు, ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సిబ్బందితో పాటు, టేబుల్ సూపర్వైజర్, రో ఇన్చార్జి, షిఫ్ట్ ఇన్చార్జి ని నియమించటం జరిగిందన్నరు. ఓట్లు లెక్కింపుకు మూడు షిఫ్టులలో ఉద్యోగులను నియమించటం జరిగిందన్నారు. కౌంటింగ్ టేబుల్ వద్దకు వచ్చిన బ్యాలెట్ బ్యాక్స్ ను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సీల్, ఫారాలు తనిఖీ చేసి, అభ్యర్ధుల ఏజెంట్లకు చూపించి బ్యాలెట్ పేపర్లును వెలుపలకి తీయాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పేపర్లు అత్యంత జాగ్రత్తగా హ్యాండ్లిగ్ చేయాలని, సక్రమంగా ట్రేలలో సర్దుకొని కౌంటింగ్ ప్రారంభించాలన్నారు. ఓట్లు చెల్లుబాటు కు సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాలపై అవగాహన ఉండి కౌంటింగ్ సమయంలో సందేహాలకు తావు లేకుండా ఖచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్ధులకు మొదటి రౌండ్ లో నిర్దేశిత ఆధిక్యం రాకపోతే కౌంటింగ్ రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున షిఫ్ట్ వారీగా విధులు కేటాయించిన వారు ప్రతిరోజు నిర్దేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చిన హ్యండ్ బుక్ ను పూర్తిగా చదివి మార్గదర్శకాలను అవగాహన చేసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్లు లెక్కింపు సమయంలో పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన విధానాలపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద కు వచ్చిన బ్యాలెట్ బాక్స్ లు తీసుకువచ్చినప్పుడు పోలింగ్ కేంద్రం, పోలైన ఓట్లు, తదితర వివరాలు పూర్తిగా సరిచూసుకొని బాక్స్ లు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభించాలన్నారు. శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్ధులకు నిర్దేశిత ఆధిక్యం వచ్చే వరకు పదే పదే బ్యాలేట్ పేపర్లలో నమోదైన ప్రాధాన్యతను పదే పదే లెక్కించాల్సి ఉన్నందున, బాలెట్ పేపర్లు చాలా జాగ్రత్తగా హ్యాండ్లీగ్ చేయాలన్నారు.
సమావేశంలో గుంటూరు , పల్నాడు, బాపట్ల , ఎన్టీఆర్ జిల్లాల డిఆర్ఓ లు ఎన్ ఎస్ కే ఖాజావలి, మురళి , గంగాధర గౌడ్ , చంద్రశేఖర్, ఏలూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి , కౌంటింగ్ పర్యవేక్షణ విధులు కేటాయించిన ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ అధికారులు , కౌంటింగ్ విధులు కేటాయించిన అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *