Breaking News

విభిన్న ప్రతిభావంతునికి బ్యాటరీ కం ఎలక్ట్రికల్ వీల్ చైర్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతునికి బ్యాటరీ కం ఎలక్ట్రికల్ వీల్ చైర్ ను పంపిణీ చేసి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సూచించారు. నేటి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టరేట్ నందు వలమల వెంకటేశ్వర్, కొండల్లో ఆధవరం గ్రామం, కెవిబి పురం మండలం, సత్యవేడు నియోజకవర్గ వాస్తవ్యుడైన విభిన్న ప్రతిభావంతునికి అధునాతన వీల్ చైర్ ను కలెక్టర్ అందచేశారు. తాను విభిన్న ప్రతిభావంతుడని తనకు వీల్ చైర్ సాయం చేయమని ముఖ్యమంత్రిని వారి పర్యటనలో కోరిన నేపథ్యంలో సీఎం  ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారి ద్వారా చెన్నై నుండి సుమారు 60 వేల రూపాయల విలువ గల అత్యాధునిక బ్యాటరీ కం వీల్ చైర్ ను తెప్పించి నేడు సదరు విభిన్న ప్రతిభావంతునికి అందచేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదరు వ్యక్తి తన అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తనకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, జిల్లా కలెక్టర్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *