Breaking News

స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిని తిరువీధుల శారదను గెలిపించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా`గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని తిరువీధుల శారద తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం గాంధీనగర్‌లోని, హనుమంతరాయ గ్రంథాలయం నుండి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువీధుల శారద మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణా`గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికల్లో బ్యాలెట్‌లో సీరియల్‌ నెంబర్‌ 24కి మీ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అంకె వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. హైకోర్టు న్యాయవాదిగా, ఆల్‌ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సొసైటీ జాతీయ అధ్యక్షురాలుగా, విద్యావేత్తగా, సామాజికవేత్తగా పేద ప్రజల కోసం ఎన్నో సేవలు అందించానన్నారు. ప్రజల ఏ సమస్యనైనా నా సమస్యగా భావించి నిత్యం ప్రజల కోసం ప్రజలలో మమేకమై మీకోసం మీ యొక్క హక్కుల కోసం పోరాడేందుకు ఎమ్మెల్సీ శాసనమండలి ఇండిపెండెంట్‌ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించాలని కోరారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ అడుగుజాడల్లో మన యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాడేందుకు మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ప్రోత్సహించాలన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులు విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు మహిళలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, వివిధ ప్రజా సంఘాలు పెన్షనర్లు సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *