-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజిఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, రోజ్ మాoడ్,శివ శంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -164, ఎంప్లాయిమెంట్ -1, పోలీస్ -7, సివిల్ సప్లై – 4, , మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ -10, స్కూల్ ఎడ్యుకేషన్ -4, సర్ఫ్-2, పశుసంవర్ధక శాఖ -2, హయ్యర్ ఎడ్యుకేషన్ – 1, రూరల్ డెవలప్మెంట్ -6, సర్వే అండ్ ల్యాండ్స్ -7, ఆర్ డబ్ల్యు ఎస్ -5, పంచాయతీరాజ్ -7, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్-1, ఎస్సి కార్పొరేషన్-1, మెడికల్ ఎడ్యుకేషన్ -2, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ – 2, నేషనల్ హైవే -1, గిరిజన సంక్షేమ శాఖ – 8, హౌసింగ్ -1, అటవీ శాఖ-1, ఐసిడిఎస్ -1, కార్మిక సంక్షేమ శాఖ -1, ఆర్ అండ్ బి-1, ఎస్.వి. మెడికల్ కాలేజీ -1 వెరసి మొత్తం 241 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News