-కింజరాపు అచ్చె న్నాయుడు ,వ్యవసాయ శాఖ మంత్రి.
-రాబోవు ఖరీఫ్ సీజన్ నారుమళ్ళు కోసం జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి .
ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల కిష్టప్ప కి లేఖ రాసిన వ్యవసాయ మంత్రి
-వరి సాగు ప్రాంతాల వారీగా వినియోగ దారులు ఎంపిక చేసుకునే వరి రకాలు ,మెరుగైన మార్కెట్ ధర పొందే రకాల వివరాలను సీజన్ కు ముందు నుండే వివరాలను రైతులకు తెలపండి .-
పరిశోధన సంచాలకులు Dr పి. సత్యనారాయణ కు తెలిపిన మంత్రి .
-ఈ పంట ను ఆధారము చేసుకుని ఖరీఫ్ మరియు రబీ సీజన్ లలో సాధారణముగా సాగుచేస్తున్న వరి రకాలు , వాటి గిట్టు బాటు ధరలు – వినియోగ దారులు మక్కువ చూపే రకాల సాగు ద్వారా రైతులు పొందే లబ్ధి గురుంచి మరింత ప్రచారం చేయాలని వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ను కోరిన మంత్రి.
-ముఖ్యమంత్రి వారి అభిలాష మేరకు సంవత్సరములో 3 పంటలు సాగు చేసేలా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల ప్రణాళికలను సిద్ధం చేయాలి .
-మిల్లర్లు ,బియ్యం ఎగుమతి దారులు ముందు నుంచి అప్రమత్తంగా వుంటూ ,వినియోగదారుల ఎంపిక చేసుకుంటున్న రకాల గురించి వ్యవసాయ శాఖ తో సమన్వయంతో వ్యవహరిస్తూ సమాచారం తెలుపుతూ వుండాలి
-మిల్లర్లు ను కోరిన మంత్రి.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తన ఛాంబర్ లో వ్యవసాయ శాఖ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్,పౌర సరఫరాల శాఖ ఎండీ మంజిన్ ఐఏఎస్, సౌరవ్ గౌర్ ఐఏఎస్ కమిషనర్ పౌర సరఫరాల శాఖ ,ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ సత్యన్నారాయణ మరియు సంబంధిత సీనియర్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష ప్రాధాన్యతను తెలుపుతూ ముఖ్యమంత్రి వారు ఈ నెల మొదటి వారపు చివరలో జరిపిన ప్రాథమిక రంగ సమీక్షలో వరి సాగుపై వారి అభిలాష మేర , ప్రతి రైతు సంవత్సరములో మూడు పంటలను సాగు చేసి ,ఆర్థికంగా బలోపేతం చేయడానికి తగిన ప్రణాలికలను ముఖ్యముగా వరి ఆహార వినియోగదారుల ఉత్సుకత, ఎంపిక ప్రకారం విత్తన రకాల సరఫరా, పంట సాగు & కోత తరువాత మార్కెట్ ధర పొందడం లో ఎటువంటి అరమరికలు ,ఇబ్బంది లేకుండా వుండే రకాల ఎంపిక ,ఆ రకాల గురుంచి ముందుగానే ప్రచారం వంటి విషయాలను , వరి నారుమళ్లు ముందుగానే పోసుకునే విధముగా నీటి విడుదలలో ప్రణాళిక లో మార్పు చేసి జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయటం తదితర అంశాల ప్రాతిపదికన ఈ సమావేశం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
నీటిని జూన్ మొదటి వారంలోనే విడుదల చేయాలని ఇరిగేషన్ మంత్రి కోరినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ వారు మాట్లాడుతూ , ఈ పంటలో నమోదైన ఖరీఫ్ మరియు రబీ సీజన్లో సాగు చేస్తున్న వరి రకాలు గురుంచి తెలిపారు .పరిశోధన సంచాలకులు డాక్టర్ పి సత్యనారాయణ ,ప్రాంతాల వారీగా వరి సాగు వివరాలను తెలిపారు. పౌరసరఫరాల ఎండీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలు చేసిన రకాలు ,వాటి పరిమాణం తెలిపారు .
మంత్రి చివరగా మాట్లాడుతూ ,రైతులు ఎక్కువగా వరి ఆహార వినియోగదారుల ఆకాంక్ష మేరకు, వరి సాగు చేబడ తారని , తదనుగుణముగా అటువంటి రకాల సాగు రకాల ఉత్పత్తి ,సరఫరా ,మేలైన యాజమాన్య పద్ధతులు,కొనుగోలు ,మార్కెటింగ్ ,తదితర అంశాలపై ముందస్తుగానే సంబంధిత వ్యవసాయ ,పరిశోధన ,మార్క్ ఫెడ్ , పౌర సరఫరాల శాఖ అవగాహన కలిగి వుండి,సమన్వయం చేసుకుంటూ, మరింత ప్రచారం జరిపి ,రైతులకు మేలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమములో వ్యవసాయ ఉప సంచాలకులు బాలు నాయక్,తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News