Breaking News

సిఎస్ లతో కేబినెట్ కార్యదర్శి డా.టివి సోమనాధన్ వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి డా.టివి సోమనాధన్ సిఎస్ లతో వీడియో సమావేశం నిర్వహించారు.గత ఏడాది డిసెంబర్ 13-15 తేదీల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశంలో సులభతర వాణిజ్య విధానానికి సంబంధించి నిబంధనలు మరియు విధానాలను సంస్కరించడంలో మరియు సరళీకరించడం లో రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేబినెట్ సెక్రటేరియట్లో కార్యదర్శి స్థాయి కోఆర్డినేటింగ్ అధికారి నేతృత్వంలో డీరెగ్యులేషన్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అంతేగాక కంప్లైయన్స్ తగ్గింపు మరియు డీరెగ్యులేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌గా వ్యవహరించడానికి క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈప్రక్రియలో భాగంగా కేబినెట్ కార్యదర్శి సోమనాధన్ సిఎస్ లతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ కంప్లయెన్స్ భారాన్ని తగ్గించేందుకు డీరెగ్యులేషన్ సెల్ కు తగిన తోడ్పాటును అందించేందుకు పలువురు కార్యదర్శులతో కూడిన ప్రత్యేక టాస్కుఫోర్సు కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.ఈకమిటీలో సభ్యులైన కార్యదర్శులు మార్చి నుండి రాష్ట్రాల్లో పర్యటిస్తారని వారు పర్యటనకు వచ్చినపుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక ఇంటర్డెక్టరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిఎస్ లకు సూచించారు.సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను(Best Practices)కేంద్రం స్వాగతిస్తుందని కేబినెట్ కార్యదర్శి సోమనాధన్ తెలిపారు.
ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ సులభతర వాణిజ్య విధానంలో భాగంగా కంప్లైయన్స్ బర్డెన్ తగ్గించడం (RCB) లేదా రెగ్యులేటరీ కంప్లైయన్స్ బర్డెన్‌ను తగ్గించడం (MRCB) కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.రాష్ట్రం ఇప్పటివరకు 60 కి పైగా నిబంధనలలో 632 సమ్మతిని తగ్గించిందని వివరించారు.ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లెయెన్స్ బర్డెన్ తగ్గించే కార్యక్రమం కింద తిరిగి ఊపందుకోవడానికి కృషి జరుగుతోందని చెప్పారు.రాష్ట్రంలో ఈకార్యక్రమం అమలును పర్యవేక్షించడానికి సిఎస్ నేతృత్వంలో ఒక సాధికార కమిటీ (EC)ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.వివిధ విభాగాలు సమర్పించిన సమ్మతి తగ్గింపు ప్రతిపాదనలను కూడా ఈసాధికార కమిటీ సమీక్షించడంతో పాటు అందుకు తగినట్లుగా తగిన ఆదేశాలను జారీ చేస్తుంది చెప్పారు.
దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక.RCB, MRCB) కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తోందని సిఎసి విజయానంద్ కేబినెట్ కార్యదర్శికి వివరించారు.2025 ప్రారంభం నుండి ఇప్పటి వరకూ 7 విభాగాలలో 60 కి పైగా భారమైన సమ్మతిని తగ్గించండం జరిగిందన్నారు.అంతేకాకుండా వ్యాపార వాతావరణాన్ని మరింత క్రమబద్ధీకరించడానికి మరింత భారమైన నిబంధనలను గుర్తించడానికి మరియు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సిఎస్ చెప్పారు.మార్చి 1వ వారంలోగా మిగిలిన సమ్మతులను హాజరయ్యేలా చూసుకోవాలని సిఎస్ ఆయా విభాగాలను ఆదేశించారు.రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేసే స్థితిని సమీక్షించడానికి మరియు మన రాష్ట్రం నుండి ఉత్తమ పద్ధతులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం నుండి ఒక బృందం మార్చి 1వ వారంలో రాష్ట్రాన్ని సందర్శించ నుందని తెలిపారు.అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతుల ఆధారంగా ఈబృందం కొన్ని సూచనలను కూడా ఇస్తుందని భావిస్తున్నట్టు సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.
ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అనంతరాము,బి.రాజశేఖర్, వాణి ప్రసాద్,ముఖ్య కార్యదర్శులు ముకేశ్ కుమార్ మీనా,శశి భూషణ్ కుమార్,ఎస్ సురేశ్ కుమార్,కార్యదర్శులు డా.ఎన్.యువరాజ్, ఎంఎం నాయక్,సౌరవ్ గౌర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *