రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని పలు MDU ఆపరేటర్ ల పై రేషన్ సరుకులు డెలివరీ సమయములో సరుకుల ధర కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని మరియు రేషన్ సరుకులు ఇవ్వడంలేదని అందుతున్న ఫిర్యాదులను దృష్టి లో ఉంచుకొని సమావేశం ఏర్పాటుచేసినట్లు ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్ నాగంజనేయులు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలోని MDU ఆపరేటర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంలో నాగంజనేయులు సమావేశములో మాట్లాడుతూ , MDU ఆపరేటర్ లు రేషన్ సరుకులు డెలివరీ సమయములో రేషన్ సరుకుల ధర కంటే ఎక్కువ ధర వసూలు చేయుట నిలిపివేయాలని, మీ పరిధిలో యున్న ప్రతి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వాలని కోరారు. ప్రతి రైస్ కార్డు దారుకు రేషన్ సరుకు అందించాలని, రేషన్ సరుకులు డెలివరీ సమయంలో MDU ఆపరేటర్ లు విధిగా వేయింగ్ మెషిన్ తూకం వేసి ఇవ్వాలని, తూకం విషయం లో ఎటువంటి అవకతవకలు లేకుండా రేషన్ సరుకులు సరఫరా చేయలని నిబంధనలను అతిక్రమించిన MDU ఆపరేటర్ లపై తీవ్రమైన క్రమ శిక్షణ చర్యలు తీసుకొనబడును IVRS సర్వే ద్వారా ఫిర్యాదులు అందిన MDU ఆపరేటర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారి వివరణ ఆధారంగా తగు చర్య తీసుకొనబడునని తెలియ చేశారు. సదరు సమావేశంలో సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర సిబ్బంది , MDU ఆపరేటర్ ల ప్రెసిడెంట్, MDU ఆపరేటర్ ల పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News