Breaking News

ఘనంగా డిపిఆర్వో కాశయ్య పదవీ విరమణ వేడుక

-విశ్రాంత జీవనం ఆనందంగా గడపాలని పలువురు ఆకాంక్ష
-కాశయ్య దంపతులకు కలెక్టర్ , జెసి , డి ఆర్వో , సిబ్బంది తదితరుల సత్కారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28: ప్రభుత్వానికి, సమాచార సాధనాలకు మధ్య వారధిగా నిలిచి, ప్రజలకు సత్వర సమాచారం అందడంలో కీలక భూమిక పోషించి, అందరి మన్ననలూ అందుకున్న ఐకా కాశయ్య అభినందనీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్వో టి సీతారామ మూర్తి తదితరులు పేర్కొన్నారు. విశ్రాంత జీవనం నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. కాశయ్య పదవీ విరమణ సందర్బంగా స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలోని సర్వారాయ కళామందిరంలో సమాచార శాఖ సిబ్బంది శుక్రవారం అభినందన వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్ పీ ప్రశాంతి కాసయ్య దంపతులను క్యాంపు కార్యాలయంలో అభినందన తెలియ 6చేస్తూసన్మానించారు. , విధి నిర్వహణలో కాశయ్య చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు. జిల్లా యంత్రాంగానికి పాత్రికేయ వర్గానికి వారధిగా విలువైన బాధ్యతలు నిర్వహించారని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్వో టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి, గౌరవ అధ్యక్షుడు మండేలా శ్రీరామమూర్తి, పాత్రికేయులు వి ఎస్ ఎస్ కృష్ణకుమార్, కెవి శైలేంద్ర, అప్పలనాయుడు, జిల్లా పౌర సమాచార అధికారి శిహెచ్ శ్రీనివాసు, డివిజనల్ పిఆర్వోలు లక్ష్మణా ఆచార్యులు, కుటుంబ సభ్యులు తదితరులు మాట్లాడుతూ విధి నిర్వహణలో కాశయ్య తో గల అనుబంధాన్ని ప్రస్తావించారు. రంపచోడవరం ఐటీడీఏ పబ్లిసిటీ సెల్ కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్ గా 1988 డిసెంబరు 12న విధుల్లో చేరిన కాశయ్య ఏలూరు డిపిఆర్ఓ కార్యాలయంలో ఉత్తమ సేవలందించారు. 2011 ఆగస్టు 11న ఆడియో విజువల్ సూపర్వైజర్ గా పదోన్నతి పొంది జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మచిలీపట్నంలో బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 2017 లో గుడివాడ డివిజన్ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి అందుకుని డివిజనల్ పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సేవలందించారు. 2022 జనవరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి పొందారు. ఆతర్వాత జిల్లాల విభజనల ప్రక్రియలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన నూతన తూర్పుగోదావరి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏప్రిల్ 2022లో బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు దిగ్విజయంగా అంకితభావంతో విధులు నిర్వర్తించి, వివాద రహితునిగా నిలిచారని పలువురు పేర్కొన్నారు. విశ్రాంత జీవనంలో ప్రశాంతంగా గడుపుతూ, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈసందర్బంగా కాశయ్య దంపతులను ఘనంగా సన్మానించి, జ్ఞాపిక, సన్మాన పత్రం అందజేశారు. పలువురు పాత్రికేయులు, సమాచార శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బందు మిత్రులు పూలమాలలతో ముంచెత్తారు. విశ్రాంత డివిజనల్ పిఆర్వోలు అలీ, సాయిబాబా, అమలాపురం డివిజనల్ పీఆర్వో రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *