రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఎం& హెచ్ ఓ డాక్టర్ కే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వినికిడి సమస్య తో చాలామంది వారి యొక్క నిత్యజీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు. పుట్టుక నుండి సరియైనటువంటి వినికిడి పరీక్షలు నిర్వహించి ఏవైనా వినికిడి సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు అయితే వాటికి చిన్న వయసు నుండే సత్వర చికిత్స అందించడం ద్వారా రాబోవు రోజుల్లో వారి యొక్క వినికిడి సమస్యలు తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు మరియు వయసు రీత్యా వినికిడి లోపం వచ్చినవారికి ఎన్జీవో సంస్థలు మరియు గవర్నమెంట్ స్కీమ్స్ లో భాగంగా వినికిడి యంత్రాలు ప్రతి పౌరుడికి అందేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రోగ్రామ్ అధికారులు జిల్లా ఎపిడిమియా లా జిస్ట్ సుదీర్ బాబు, డిప్యూటీ డెమో సత్యకుమార్,డా .మౌనిక , ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News