రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5000 హె. లక్ష్యానికి 2821 హె. ప్రగతి సాదించటం జరిగినదని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయవలెనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఆసియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , డ్రిప్ ఇరిగేషన్ యూనిట్స్ ఏర్పాటుకు రైతు వాటా త్వరితగతిన చెల్లించవలెనని , ఇప్పటికే పరిపాలనా ఆమోదం పొందిన రైతులకు డీప్ పరికరములను అందచేసి, డిప్ అమర్చటం పూర్తి చేసి, సంబంధిత అధికారులతో తుది పరిశీలన చేయవలెనని స్పష్టం చేశారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడం పై ఆయిల్ పామ్ కంపెనీ వారు అంగీకరించిన మేరకు మాత్రమే లక్ష్యాలను ఇచ్చామన్నారు. పతాంజలి వారు 50% కన్నా తక్కువ ప్రగతి సాధించడం , నవభారత్ 56% , 3F కంపెనీ వారు 69% మేర మాత్రమే ప్రగతి సాధించడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 31 లోగా లక్ష్యాలను సాధించేందుకు నాలుగు వారాల కు అనుగుణంగా లక్ష్యాలను సిద్దం చేసి, ఆమేరకు గ్రౌండింగ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. రానున్న మూడు వారాలు ప్రగతీ పై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించనున్నట్లు కలక్టర్ తెలియ చేశారు.
రాజానగరం – సామర్లకోట ఆసియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రహదారి పనులని మరింత వేగవంతంగా పూర్తి చెయ్యాలని కలక్టర్ తెలియ చేశారు. గత 15 రోజుల ప్రగతీ పై సమీక్ష చేస్తూ, యాక్షన్ ప్లాన్ తయారు చేసి నివేదిక అందచేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎడిబి) వై రవీంద్ర ను ఆదేశించారు. జిల్లా ఉద్యాన అధికారీ పధక సంచాలకులు, ఎ.పి.యం.ఐ.పి, ఏ దుర్గేష్ , హార్టికల్చర్ అధికారి బి సుజాత కుమారి, మండల ఉద్యాన అధికారులు , ఆయిల్ పామ్ కంపనీ ప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News