-డెలివరి చేసే క్రమంలో ఎటువంటి అదనపు రుసుం వసూలు చెయ్యరాదు
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలని , డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చెయ్యవద్దు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో ఏజెన్సీస్ ప్రతి నిధులతోసమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ దీపం 2 పథకం ద్వా రా వినియోగ దారులు గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్యాస్ డెలివరీ చేసిన తదనంతరం 48 గంటలలోపు సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు బ్యాంకు అకౌంట్లో పడిందా లేదా అని డీలర్స్ తప్పని సరిగా తనిఖీ చేసుకోవా లన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన బాయ్స్ బిల్లు సొమ్ము కా కుండా ఎక్కువ సొమ్ము డిమాండ్ చేయకుండా ఎప్పటికప్పుడు డీలర్లు పరిశీలించు కోవాలన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన తరువాత బాయ్స్ బిల్లు సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేయకూడదని డె లివరీ బాయ్స్ కి కౌన్సిలింగ్ డీలర్స్ ఇవ్వాలన్నారు.
48 గంటల్లో గ్యాస్ డెలివరీ ఇచ్చిన తదనంతరం రసీదులు ఇస్తున్నారా లేదా తనిఖీ చేసుకోవాలని గ్యాస్ డీలర్లకు తెలిపారు. జిల్లాలోదీపం 2 పథకం ద్వారా 408 మంది లబ్ధిదారులకు సబ్సిడీ పొందలేదని, త్వరితగతిన సబ్సిడీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలె క్టర్ తెలిపారు. జిల్లాలో 43 గ్యాస్ ఏజన్సిలు ఉన్నా యని తెలిపారు. 28 హెచ్పిసిసి, ఐఓపి సీ 12, బీపీ సీసీ 43 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ, ఎం. నాగాంజనేయులు, హెచ్.పీ గ్యాస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వీకే రామారావు, హెచ్.పీ గ్యాస్, జిల్లా ప్రెసిడెంట్, ఎం అప్పాజీ, హెచ్.పీ గ్యాస్ డీలర్స్, వి దుర్గాప్రసాద్, ఎస్. శివకుమార్ , ఎన్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News