-స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ కార్యక్రమములో పాల్గొనాలి
-కేతన్ గార్గ్, కమిషనరు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరములో స్వచ్చ సర్వేక్షణ్ – 2024 లోని వివిధ అంశముల అమలు తీరును పరిశీలన చేయుటకు స్వచ్చభారత్ మిషన్ సభ్యులు వారములో నగరములో పర్యటిస్తున్నందున అన్ని విభాగముల అధికారులు పూర్తి ఆప్రమత్తముగా ఉండవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనరు కేతన్‌గార్గ్ ఆదేశించియున్నారు.
ది.03-03-2025 తేదిన నగరపాలక సంస్థ కార్యాలయములో వివిధ విభాగాధిపతులు, నగరములోని జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులతో సమావేశము నిర్వహించి సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసికొనుట ద్వారా ప్రజల భాగస్వామ్యమును పెంచుటకు చర్యలు తీసికొనవలసినదిగా ఆదేశములు ఇచ్చియున్నారు. నగరపాలక సంస్థ 2020 సంవత్సరములో 51, 2021 సంవత్సరములో 41, 2022 సంవత్సరములో 97 మరియు 2023 సంవత్సరములో 59 సంపాదించింది. ఈ సంవత్సరము యింకా మెరుగైన స్థానం సాధించాలని ఆదేశించాలన్నారు. వార్డు ప్రత్యేకాధికారులు తమ కేటాయించిన వార్డులలో విస్తృతంగా తిరిగి సిటిజెన్ ఫీడ్ బ్యాక్ కు సంబంధించి ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసారు. ప్రజలు ఇంటింటి చెత్తను సెగ్రిగేషన్ చేసి నగరపాలక సంస్థ వాహనమునకు అందించి స్వచ్చ నగరముగా రూపొందించుటలో భాగస్వాములు కావలసినదిగా కోరియున్నారు. అదే విధముగా అందరూ వ్యాపారస్తులు, తోపుడు బళ్ళవారు తమ చెత్తను డస్ట్ బిన్‌లలో మాత్రమే ఉంచి నగరపాలక సంస్థకు చెందిన వాహనములకు మాత్రమే అందించవలసినదిగా తెలిపారు.
పాఠశాలల విద్యార్ధులు, కాలేజి విద్యార్ధులు స్వచ్చ సర్వేక్షణ్ అంశములో భాగస్వాములు అయి సిటిజన్ ఫీడ్‌బ్యాక్ పూర్తి స్థాయిలో చేయుట ద్వారా స్వచ్చతలో అత్యున్నత ర్యాంక్ వచ్చే విధముగా భాగస్వాములు కావాలని కమిషనరు వారు కోరారు. ఈ సంవత్సరము 1,50,000 వేల మంది ప్రజల నుండి తమ అభిప్రాయములు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడ మైనదని తెలిపారు.
యీ కార్యక్రమములో మున్సిపల్ ఆరోగ్య శాఖాధికారిని డా||ఎ.వినూత్న , ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీమతి మాధవి, ఇతర విభాగాల అధికారులు, విద్యాశాఖాధికారులు రవితేజ, రజని, ఆరోగ్యశాఖాధికారి పాల్గొనినారు.
Prajavartha Online Telugu News