-ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయంలో అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలోని నాయీ బ్రాహ్మణులకు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ అందుకుని ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారైందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఈ అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ సదస్సులో ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్ఢినేటర్ మాదిగాని గురునాథం మాట్లాడుతూ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులు కూడా ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారై ఆర్థిక స్వాలంబన సాధించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ అండగా వుంటారని తెలిపారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కోసం ఉద్యం పోర్టెల్ లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో…ఏ యూనిట్ పెట్టుకుంటే లాభదాయకంగా వుంటుందో వివరించారు.
గతంలో ప్రభుత్వ పథకాలకి సంబంధించి బ్యాంకుల నుంచి ప్రజలు లోన్స్ అందుకోవాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుండేదని…అలాంటి ఇబ్బందులు పడకుండా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లోన్స్ పొందెందుకు దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి కలెక్టర్ ద్వారా బ్యాంకర్స్ తో మాట్లాడించి బ్యాంకుల నుంచి లోన్స్ అందుకునేందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్ఢినేటర్స్ మాదిగాని గురునాథం, డాక్టర్ సంకె విశ్వనాథం, మాజీ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జున యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సూరవరపు నాగారాజు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సాధికారత కమిటి నాయకులు సగరపు అప్పారావు, బిసి సెల్ నాయకులు ఉప్పాడి రాము, రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి నాయకులు నరసింహాచౌదరి, అబీద్ హుస్సెన్ లతోపాటు తదితర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News